ఈ సీజన్ లో టేబుల్ టాపర్ గా పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది గుజరాత్ టైటాన్స్. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో సమర్థంగా రాణిస్తూ తమకు ఎదురొచ్చిన అన్నీ టీమ్స్ పైనా అద్భుతమైన విజయాలు సాధిస్తోంది గుజరాత్ టైటాన్స్. ప్రిన్స్ శుభమన్ గిల్ కెప్టెన్సీలో...కోచ్ ఆశిష్ నెహ్రా గైడెన్స్ లో దుమ్మురేపుతోంది జీటీ. ఆడిన 8 మ్యాచుల్లో 6 గెలుచుకుని 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ వైపు వేగంగా పరుగులుపెడుతున్న గుజరాత్ టైటాన్స్ అదే టైమ్ లోనూ సహనం కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తోంది. ఎవరో కాదు కెప్టెన్ గిల్ అంపైర్లతో మాట్లాడితే గొడవలు పెట్టుకుంటున్నాడు. ఫీల్డర్ల ప్లేస్మెంట్స్ సెట్ చేయటం కోసం విపరీతంగా టైమ్ తీసుకోవటం..కావాలనే మ్యాచ్ ను జాప్యం చేసేలా బిహేవ్ చేయటం...బంతి మార్పు కోసం పదే పదే అడగటం..ఇలా వేర్వేరు స్ట్రాటజీలు వాడుతూ మ్యాచ్ లు అయితే గెలుస్తోంది కానీ గుజరాత్..ఫెయిర్ ప్లే మాత్రం ఆడలేకపోతోంది. దానికి నిదర్శనంగానే ఈ సీజన్ లో పాయింట్స్ పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఫెయిర్ ప్లేలో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉంటే..పాయింట్స్ టేబుల్ లో అడుగున ఉన్న చెన్నై సూపర్ కింగ్స్..ఫెయిల్ ప్లేలో మాత్రం టాప్ లో ఉంది. ఎప్పుడూ ఏ స్ట్రాటజీ అప్లై చేయాలో బౌండరీ లైన్ దగ్గరుండి ఆటగాళ్ల చెవులు కొరుకుతూ చెబుతూనే ఉండే కోచ్ నెహ్రా ఫెయిర్ ప్లే విషయంలో మరి టీమ్ కు ఏం చెప్పట్లేదో గెలిస్తే చాలు ఎలా ఆడినా పర్లేదు అని చెబుతున్నాడో మరి చూడాలి.